13న జింకా లాజిస్టిక్స్​ ఐపీఓ ఓపెన్‌

13న జింకా లాజిస్టిక్స్​ ఐపీఓ ఓపెన్‌

న్యూఢిల్లీ : ట్రక్ ఆపరేటర్ల కోసం డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ నిర్వహించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభమై, 18న ముగియనుంది.  పబ్లిక్​ఇష్యూతో కంపెనీ రూ.1,115 కోట్లు సేకరించనుంది. 

ఒక్కో షేరుకు రూ.259-–273 ధరను నిర్ణయించినట్లు తెలిపింది. ఈ  ఐపీఓ రూ. 550 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ  2.06 కోట్ల షేర్ల ఆఫర్ ఆఫ్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉంటుంది.  అర్హులైన ఉద్యోగులకు ఒక్కో ఈక్విటీ షేర్‌‌‌‌‌‌‌‌పై రూ.25 తగ్గింపు ఇస్తారు.