జిన్నింగ్ మిల్లులో కార్మికుడు మృతి

జిన్నింగ్ మిల్లులో కార్మికుడు మృతి

పరిగి వెలుగు : పూడూరు సాయిబాబా జిన్నింగ్ మిల్లులో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు  రాత్రి చనిపోయాడు.  మంగళవారం చెన్గోముల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి  వివరాల ప్రకారం   పూడూరు మండలం సాయిబాబా జిన్నింగ్ మిల్లులో  కర్నాటకలోని బళ్లారికి  చెందిన హనీఫ్ (41)  మృతి చెందాడు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.