Reliance Jio 5G: 100 రోజుల్లో 101 సిటీల్లో5జీ సేవలు

ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. అందుకు కావాల్సిన పనుల్ని వేగవంతం చేసినట్లు జియో తెలంగాణ సీఈఓ కేసి రెడ్డి చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లో 5జీ సేవల్ని అందిస్తున్న జియో, ఇప్పుడు వరంగల్, కరీంనగర్ లో కూడా తన సేవల్ని ప్రారంభించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 6 పట్టణాల్లో 5జీ సేవల్ని జియో ప్రారంభించింది. 

తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, సేలం, హోసూర్, వెల్లూరు నగరాల్లో 5జీ సేవల్ని ప్రారంభించింది. దీంతో దేశంలోని 101  పట్టణాలు, నగరాలు జియో 5జీ సేవల్ని పొందుతున్నాయి. ఈ ఘనతను కేవలం 100 రోజుల్లోనే సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జియో 5జీ సేవలు వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో జియో 5జీ వాడుతున్నారు.