రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ జియో ఫిక్స్డ్ వైర్లెస్ కనెక్టవిటీ డివైజ్ అయిన జియో ఎయిర్ ఫైబర్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి రోజు ఈ కొత్త డివైజ్ ను విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉన్న నెట్ వర్క్ ను జియో ఎయిర్ ఫైబర్ ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇండ్లు, కార్యాలయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తామని పేర్కొంది.
JioFiber , JioAirFiber కలయికతో భారతీయ గృహ విభాగంలో కస్టమర్ విలువ, ఆదాయ వృద్ధికి మరో మార్గాన్ని అందిస్తున్నామని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు.
రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్ - సేవ కోసం నమోదు ఎలా
- MyJio యాప్ లేదా Jio.com వెబ్‌సైట్‌లో మీ ఇంటి చిరునామాను షేర్ చేయాలి.. - నెట్‌వర్క్ లభ్యతను తనిఖీ చేయడానికి, Jio AirFiber సేవను అందించడానికి Jio మీతో కనెక్ట్ అవుతుంది.- హై-స్పీడ్ వైర్‌లెస్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడంలో మీకు సహాయపడటానికి ఆపరేటర్ విభిన్న ప్లాన్‌లను అందిస్తారు.