ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ బుల్లెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ప్రత్యర్థులు జియో, ఎయిర్ టెల్, వీఐ కంపెనీలు వరుసగా సబ్ స్క్రైబర్లను కోల్పోతుంటే.. దానికి భిన్నంగా బీఎస్ఎన్ఎల్ మాత్రం రోజు రోజుకు తమ వినియోగదారులను గణనీయంగా పెంచుకుంటూ పోతుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గణంకాలు స్పష్టం చేశాయి. ట్రాయ్ 2024 సెప్టెంబర్ డేటా ప్రకారం.. ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో 7.96 మిలియన్ల సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. సెప్టెంబర్‌తో కలుపుకుని వరుసగా మూడవ నెలలో భారీ మొత్తంలో వినియోగదారులు జియో నెట్ వర్క్‌ను వీడారు.
మరోవైపు.. సెప్టెంబర్ నెలలో ఎయిర్‌టెల్ సుమారు 1.43 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, వొడాఫోన్ ఐడియా 1.55 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయాయి. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 0.84 మిలియన్ల మంది కొత్త సబ్ స్ర్కైబర్లను ఆకర్శించింది. సబ్ స్ర్కైబర్లు బీఎస్ఎన్ఎల్కు జైకొట్టడం.. జియో, ఎయిర్ టెల్, వీఐ వంటి టెలికం కంపెనీలకు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం మొబైల్ టారీఫ్ ప్లాన్లే అని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జియో, ఎయిర్ టెల్, వీఐ కంనీలు టారీఫ్ ప్లాన్లను భారీగా పెంచాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరసమైన ధరలకు ఆకర్శణీయమైన రీచార్జ్ ప్యాకేజీలను ప్రకటించింది. దీంతో సబ్ స్ర్కైబర్లు గంపగుత్తగా జియో, ఎయిర్ టెల్, వీఐ నెట్ వర్క్ కు గుడ్ బై చెప్పి బీఎస్ఎన్ఎల్ బాట పడుతున్నారు. దీంతో ప్రైవేట్ టెలికం కంపెనీలు జియో, ఎయిర్ టెల్, వీఐ వరుసగా వినియోదారులను కోల్పోతున్నాయి.
ALSO READ | ఎయిర్‌టెల్ నుంచి నోకియాకు భారీ ఆర్డర్
దీంతో పాటుగా.. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కూడా ఆ సంస్థకు సబ్ స్క్రైబర్లు పెరగడానికి మరొక కారణం. ట్రాయ్ సెప్టెంబర్ 30, 2024 డేటా ప్రకంర.. జియో 463.78 మిలియన్లు, ఎయిర్‌టెల్ 383.48 మిలియన్లు, వీఐ 212.45 మిలియన్లు, BSNL/MTNL కలిపి 93.8 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి. 40.20 శాతం మార్కెట్ వాటాతో జియో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.