రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర లేపింది. జియో భారత్ 4G ఫోన్‌ను విడుదల చేసింది. కేవలం రూ. 999 కే ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ఇది. 2023 జూలై 7 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నట్లుగా తెలిపింది.
దేశంలో ఇప్పటికీ 25 కోట్ల మంది 2జీ మొబైల్స్ వాడుతున్నారని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో నెట్వర్క్ తీసుకొచ్చినప్పుడే ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. అందులో భాగంగానే జియో భారత్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.
ఈ మెుబైల్ పై రూ.123 టారిఫ్ ప్లాన్ ప్రవేశపెట్టింది జియో. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో 14 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటుగా జియో సినిమా, జియో సావన్, ఎఫ్ ఎం రేడియో వంటి ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ కూడా వాడుకోవచ్చు. యూపీఐ పెమెంట్స్ కూడా చేయోచ్చు.
ALSO READ:హమ్మయ్య సాయిరాం : రూ. 2 వేల నోట్లు.. 76 శాతం వచ్చేశాయ్
ఇతర కంపెనీల ఫీచర్ ఫోన్ల ఆఫర్లతో పోలిస్తే జియో 30 శాతం తక్కువకే అందిస్తోంది. 7 రెట్లు ఎక్కువ డేటా అందిస్తోంది. కొత్తగా లాంచ్ చేసిన జియో భారత్ ఫోన్ ఇతర ఫీచర్ ఫోన్ లాగా కీప్యాడ్ స్క్రీన్‌కి దిగువన కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ స్పీకర్లపై కెమెరా కూడా ఉంది.