క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్ వచ్చేస్తుందా!

జియో కాయిన్..ఇప్పుడు నెట్టింట దీని గురించే చర్చ..ప్రముఖ వ్యాపార వేత్త.. బిలియనీర్..భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండ స్ట్రీస్ పేరెంటల్ కంపెనీ జియో ప్లాట్ ఫాం.. ఇండియాలో జియో కాయిన్ ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్రిప్టో కరెన్సీ డెవలపర్ అయిన పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగం అయిన పాలిగాన్ ల్యాబ్స్ తో ఇటీవల టైఅప్ కావడంతో జియో కాయిన్ గురించి ఈ స్పెక్యులేషన్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

JioCoin గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ చాలా మంది వినియోగదారులు JioCoin ఫొటోలను X(ట్విట్టర్‌)లో  షేర్ చేస్తున్నారు. Bitinning CEO Kashif Raza కూడా అదే షేర్ చేశారు. JioCoin మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్‌లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని చెప్పుకొచ్చారు. 

జియో కాయిన్

బ్లాక్‌చెయిన్ , వెబ్3 సామర్థ్యాలతో తన ఆఫర్లను మెరుగు పర్చేందుకు పాలిగాన్ ల్యాబ్‌లతో జియో ఇటీవలి టైఅప్ అయింది. అయితే అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో నుంచి  జియో కాయిన్ , దాని ఉపయోగాలు, ఇతర విషయాలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఇటీవల భారతదేశంలో వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం జియో ప్లాట్‌ఫాంలు పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దాదాపు 450 మిలియన్ల కస్టమర్ల పర్సనల్ డేటా కంట్రోల్, మెరుగైన ప్రైవసీ అందించేందుకు Web3 ప్రయోజనాలను ఉపయోగించుకోనున్నారు. 

ముఖేష్ అంబానీ క్రిప్టో కరెన్సీని ఇండియాకు తీసుకురావాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని.. క్రిప్టో కరెన్సీ లాంటి కరెన్సీని ఇండియాలో ప్రవేశ పెట్టాలని తెలుస్తోంది.. దీని కోసమే పాలిగాన్ ల్యాబ్స్ తో టైఅప్ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  పాలీగాన్ ల్యాబ్స్.. క్రిప్టో,బ్లాక్‌చెయిన్ అయినందున జియో, పాలిగాన్ భాగస్వామ్యం.. క్రిప్టో పరిశ్రమలో జియో ప్రవేశాన్ని సూచిస్తోంది. 

క్రిప్టో కరెన్సీకి ప్రస్తుతం 500 మిలియన్లు కస్టమర్లు ఉన్నారు. ఒకవేళ జియో కాయిన్ గనక వస్తే.. క్రిప్టో కరెన్సీకి గట్టి పోటీనిస్తుందని చెప్పొచ్చు.. ఎందుకంటే.. ఇప్పటికే జియో ప్లాట్ ఫాం కు 450 మిలియన్ల వినియోగదారులున్నారు. జియో కాయిన్ వస్తే ఈజీగా క్రిప్టోకరెన్సీని వెనకేస్తుందని అంచనా వేస్తున్నారు.