జియో దీపావళి ధమాకా.. షాపింగ్ చేస్తే ఏడాది పొడవునా 5G డేటా ' ఫ్రీ'

తమ వినియోగదారులకు దేశీయ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. ఏడాది పొడవునా(12 నెలలు) ఉచిత హైస్పీడ్ డేటా పొందేలా దీపావళి ధమాకా ఆఫర్‌ ప్రారంభించింది. ఇది దేశంలోని 49 కోట్ల మంది వినియోగదారులకు ఉపశమనం కలిగించే తియ్యని కబురని జియో సంస్థ పేర్కొంది. 

జియో దీపావళి ధమాకా

  • జియో దీపావళి ధమాకా ఏడాది పొడవునా అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తుంది. 
  • ఈ ప్లాన్‌లో వినియోగదారులు తమ రోజువారీ డేటా పరిమితి అయిపోతుందనే చింత లేకుండా హై-స్పీడ్ 5G డేటాను ఆస్వాదించవచ్చు. 

Also Read :- యాపిల్ రిటైల్ స్టోర్లలో 400 ఉద్యోగాలు

ఉచిత ఇంటర్నెట్ ఎలా పొందాలంటే..?

  • ఏడాది పొడవునా ఉచిత ఇంటర్నెట్‌ ఆఫర్ పొందాలంటే, వినియోగదారులు తప్పనిసరిగా రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్ నుండి రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేయాలి.
  • ఇలా షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఒక సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్‌ ఆఫర్ కు అర్హులు. ఈ ఆఫర్ నవంబర్ 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున ఆసక్తి గల వారు త్వరగా కొనుగోలు చేయండి.. ఆఫర్ పొందండి. రూ.20వేలకు ఏం కొనుగోలు చేయాలని ఆలోచించక్కర్లేదు. టీవీ, రిఫ్రిజరేటర్, ల్యాప్ టాప్ .. ఇలా ఏవి కొనుగోలు చేసిన ఆఫర్ వర్తిస్తుంది.

అలాగే, జియో తన ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై ప్రత్యేక ఆఫర్‌ అందిస్తోంది. దీపావళి ధమాకా ఆఫర్ కింద వినియోగదారులు రూ. 2,222కి దాదాపు 3 నెలల పాటు జియో ఎయిర్ ఫైబర్ సేవలు పొందవచ్చు.