
పారిశ్రామిక దిగ్గజం జియో ఈవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోందని వార్తలొస్తున్నాయి... త్వరలోనే జియో ఎలక్ట్రిక్ సైకిల్ ను లాంచ్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ కస్టమర్స్ కి తగ్గట్టుగా అధునాతన ఫీచర్లతో, లాంగ్ రేంజ్ బ్యాటరీతో, రూ. 25వేల నుండి 45వేల వరకు మోడల్స్ తో సరసమైన ధరతో జియో ఎలెక్ట్రిక్ సైకిల్ రానుందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
సింగిల్ ఛార్జ్ తో 400 కిలోమీటర్ల రేంజ్:
ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిలోమీటర్ల రేంజ్ అన్నది ఈ సైకిల్ ఫీచర్స్ లో హైలైట్ అని చెప్పాలి. ఇదే గనక నిజమైతే.. ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్ లో జియో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేయడం ఖాయమని చెప్పచ్చు. ఈ సైకిల్ లిథియం ఐయాన్ బ్యాటరీతో రానుందని.. దీంతో ఎఫిషియన్సీ, లాంగివిటీ పెరుగుతుందని తెలుస్తోంది. వీటితో పాటు జియో సైకిల్ లో మరికొన్ని బెస్ట్ ఫీచర్స్ ఉండనున్నాయని సమాచారం.
- 3 నుంచి 5 గంటల ఫుల్ ఛార్జ్ టైంతో ఫాస్ట్ ఛార్జింగ్
- రిమూవబుల్ బ్యాటరీ
- పర్ఫామెన్స్ ని పెంచే స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం
మోటర్ పర్ఫామెన్స్:
ఈ ఇ-బైక్ 250 నుండి 500 వాట్లతో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని, ఇది అర్బన్ రోడ్స్ తో పాటు తేలికపాటి ఆఫ్-రోడ్ యూసేజ్ కి కూడా సెట్ అవుతుందని తెలుస్తోంది.
- సౌకర్యవంతమైన రైడ్ కోసం స్మూత్ యాక్సిలరేషన్
- మల్టీ రైడింగ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్)
- సమర్థవంతమైన ప్రయాణానికి పెడల్-అసిస్ట్ టెక్నాలజీ
జియో ఎలక్ట్రిక్ సైకిల్ గనక లాంచ్ అయితే.. ఈవీ సెగ్మెంట్ లో ఒక రెవెల్యూషన్ వస్తుందనే చెప్పాలి. స్మార్ట్ ఫీచర్లు, ఇంప్రెసివ్ రేంజ్ తో ఉన్న ఈ సైకిల్ సరసమైన ధరకే రావడం ఈ సెగ్మెంట్ కి గేమ్ చేంజర్ లాంటిదని చెప్పాలి. అయితే.. ఈ సైకిల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్నది అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది.