క్రెడిట్​కార్డు వివరాలతో 1.11లక్షలు డ్రా..జియో ఫైబర్​టెక్నీషియనే దొంగ

క్రెడిట్​కార్డు వివరాలతో 1.11లక్షలు డ్రా..జియో ఫైబర్​టెక్నీషియనే దొంగ

బషీర్​బాగ్, వెలుగు: ఓ వృద్ధుడి క్రెడిట్ కార్డు కొట్టేసి రూ.1.11లక్షలు వాడుకున్న జియో ఫైబర్​టెక్నీషియన్​ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి(78)కి ఇటీవల యాక్సిస్​బ్యాంక్​నుంచి మెసేజ్​వచ్చింది. అందులో క్రెడిట్​కార్డు డ్యూ అమౌంట్​రూ. 1,11,589 అని ఉంది. వెంటనే యాక్సిస్ బ్యాంక్ కు వెళ్లి ఆరా తీయగా, పేటీఎం ద్వారా లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు.

తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదంటూ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ పి.ప్రమోద్ కుమార్ టీమ్​దర్యాప్తు జరపగా వరంగల్ జిల్లాకు చెందిన ముదికే బాల్ రాజ్ ఈ లావాదేవీలు చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా జియో ఫైబర్ టెక్నీషియన్ అని తెలిసింది. గతంలో వృద్ధుడి ఇంటికి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు వివరాలు, వ్యక్తిగత వివరాలు సేకరించి, కొత్త కార్డును అప్లై చేసినట్లు తెలిసింది. ఆ కార్డు ను ఉపయోగించి రూ.1,11,589 లను వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది.