- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో సాధించిన కంపెనీ
- క్యూ2 లో కంపెనీ నికర లాభం రూ.668 కోట్లు
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 668.18 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. జియో ఫైనాన్షియల్‌కు వచ్చిన నికర లాభంలో జాయింట్ వెంచర్లు, అసోసియేట్ కంపెనీల నుంచి వచ్చిన ప్రాఫిట్ కూడా కలిసి ఉంది. మొత్తం రెవెన్యూ (కేవలం జియో ఫైనాన్స్ రెవెన్యూనే) జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.608.04 కోట్లకు చేరుకుంది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.186 కోట్లు, డివిడెండ్ ఇన్‌కమ్ రూ.217 కోట్లు ఉన్నాయి.
ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో కంపెనీకి రూ.202 కోట్ల వడ్డీ ఆదాయం వచ్చింది. డివిడెండ్ ఇన్‌కమ్ ఏం రాలేదు. క్యూ2 లో కంపెనీ ఖర్చులు రూ. 71.43 కోట్లుగా, నెట్ ట్యాక్స్ రూ. 86.25 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ.1,022 కోట్ల రెవెన్యూ (కన్సాలిడేటెడ్) పై రూ.1,000 కోట్ల నికర లాభం సాధించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఏఆర్ గణేష్‌ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నియమించింది. గణేష్ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో 13 ఏళ్లు పనిచేశారు.
యో ఫైనాన్షియల్, జెరోధా మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతిపెద్ద నెట్‌వర్క్ ఉండడంతో ఈ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్‌లోకి అదనంగా 5 కోట్ల మంది యూజర్లను తీసుకురాగలవని ఎడెల్వీస్ వెల్లడించింది.