
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో జియో పేమెంట్స్ బ్యాంకుకు ఉన్న రూ.104.54 కోట్ల విలువైన వాటా కొనుగోలు చేస్తున్నట్టు జియో ఫైనాన్షియల్ ప్రకటించింది. జియో ఫైనాన్షియల్‌కు ప్రస్తుతం జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో (జేపీబీఎల్) 82.17 శాతం వాటా ఉంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు మంగళవారం ఎస్బీఐ నుంచి 7.90 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను రూ. 104.54 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ కొనుగోలు తర్వాత, జేపీబీఎల్ కంపెనీకి పూర్తిగా అనుబంధ సంస్థగా మారుతుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ కొనుగోలు రిజర్వ్ బ్యాంక్ ఆమోదానికి లోబడి ఉంటుంది.