జియో AI వచ్చేస్తోంది: 100GB క్లౌడ్ స్టోరేజీ ఫ్రీ.. జియో టీవీ కూడా..

జియో AI వచ్చేస్తోంది: 100GB క్లౌడ్ స్టోరేజీ ఫ్రీ.. జియో టీవీ కూడా..

ముంబై: జియో కస్టమర్లకు ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ గుడ్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి నుండి జియో ఏఐ క్లౌడ్‌ సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జియో క్లౌడ్ వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం ముంబైలో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 47వ ఏజీఎం మీటింగ్‎లో ఈ మేరకు ముఖేష్ అంబానీ ప్రకటన చేశారు. దీంతో పాటుగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 ఏళ్లలో అతిపెద్ద మొబైల్‌ డేటా కంపెనీగా జియో ఎదిగిన సందర్భంగా రిలయన్స్ షేర్ హోల్డర్లకు 1:1 షేర్లు బోనస్‎గా ప్రకటించారు. జియో ఫైబర్ రిమోట్‌లో ఇకపై AI బటన్‌తో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు వెల్లడించారు. హలో జియో పేరుతో సెటప్‌ బాక్స్‌ కోసం ఓఎస్ టీవీ అందుబాటులోకి తీసుకోరాబోతున్నట్లు తెలిపారు. 

also Read : టెక్నో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ సెంటర్ షురూ

జియో యూజర్ల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్‌ 'జియో బ్రెయిన్‌' తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ముకేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారసులకు కంపెనీ బాధ్యతలను అప్పగించారు. కూతురు ఈషాకు రిలయన్స్ రిటైల్‌,  కుమారులు ఆకాశ్‌కి జియో, అనంత్‌కు న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగించారు. రిలయన్స్ కంపెనీల చైర్మన్ గా మాత్రమే మరో 5 ఏళ్లు ముఖేష్ అంబానీనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ గ్రాండ్‎గా జరిగిన విషయం తెలిసిందే.  ఆకాష్ అంబానీ, రాధిక మర్చంట్‎ల వివాహం కోసం ముఖేష్ అంబానీ దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. అయితే, చిన్న కుమారుడు విహహం జరిగిన నెలల వ్యవధిలోనే ముఖేష్ అంబానీ వారసులకు వ్యాపారులు అప్పగించడం హాట్ టాపిక్‎గా మారింది. 

మరిన్ని వార్తలు