ప్రీమియం యూజర్లను జియో హాట్ స్టార్ మోసం చేస్తోందా..?

ప్రీమియం యూజర్లను జియో హాట్ స్టార్ మోసం చేస్తోందా..?

ఐపీఎల్, వరల్డ్ కప్ మొదలైన స్ట్రీమింగ్ లను ఇన్నాళ్లు ఫ్రీగా అందించిన జియో సినిమా ఇటీవలే హాట్ స్టార్ తో కొలాబరేట్ అయ్యి ‘జియో హాట్ స్టార్’ అనే కొత్త ఉమ్మడి ప్లాట్ ఫామ్ ను ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసిందో అంతే ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కారణం ఏంటంటే.. కస్టమర్ల దగ్గర జియో హాట్ స్టార్ ఎక్కువ వసూలు చేస్తున్నప్పటికీ పూర్ క్వాలిటీ స్ట్రీమింగ్ అందిస్తుండటమేనని యూజర్లు అంటున్నారు. 

జియో హాట్ స్టార్ పై ఇండియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రీమియం సబ్ స్క్రైబర్లను లోక్వాలిటీ స్ట్రీమింగ్ కే పరిమితం చేస్తూ మోసం చేస్తోందని సబ్ స్ర్కైబర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియం సర్వీస్ కోసం ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నప్పటికీ.. లో క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ ఇస్తూ జియో హాట్ స్టార్ మోసం చేస్తోందని నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఇతర దేశాలలో ఇదే కంటెంట్ ను 4K UHD ఇస్తూ డాల్బీ ఆటమ్స్, డాల్బీ విజన్ లో అందిస్తున్నారని, కానీ ఇక్కడ యూజర్లను 1080p రిజొల్యూషన్ కే పరిమితం చేస్తున్నారని యూజర్లు మండిపడుతున్నారు. 

ALSO READ | మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. తులం లక్షకు పోయేదాకా తగ్గేదేలే..!

యాప్ వినియోగించే చాలా మంది యూజర్లను 25 FPS కు పరిమితం చేస్తున్నారని, కానీ జియో సెట్ టాప్ బాక్స్ వినియోగిస్తున్న వారికి 50 FPS ఇస్తున్నారని, అంతే మొత్తంలో చెల్లిస్తున్నప్పటికీ ఈ వివక్ష ఏంటని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శిస్తు్న్నారు. సంవత్సరానికి 1499 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ ప్రీమియం క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదని ట్రెండింగ్ లోకి తెచ్చారు. 

హాట్ స్టార్ జియో సినిమాతో కలవక ముందు HBO కంటెంట్ హై క్వాలిటీలో ఉండేదని, ఇప్పుడు ప్రాపర్ ఫార్మాట్ లో లేకపోవడమే కాకుండా ఆడియో, వీడియో పూర్ క్వాలిటీలో అందిస్తున్నారని యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

జియోను ట్యాగ్ చేస్తూ ఈ ప్రశ్నలు లేవనెత్తగా ఆ ట్వీట్ ను జియో  తొలగించడం చర్చనీయాంశంగా మారింది. యూజర్లకు సమాధానం చెప్పకపోగా మళ్లీ ట్వీట్ లను తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.