జియో నెట్ వర్క్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీచార్జ్ ధరలను భారీగా పెంచింది. ఎంట్రీ లెవెల్ నెలవారీ ప్లాన్లనుంచి ఎక్కువ రేటు ప్లాన్ల వరకు ఏ ఒక్క ప్లాన్ ను కూడా వదల్లేదు. అన్ని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల తారీఫ్ ను ఎవరూ ఊహించని రీతిలో భారీగా పెంచింది. పెరిగిన ధరల ప్రకారం.. కస్టమర్లకు నెలకు రూ. 600 వరకు భారం పడుతోంది. పెంచిన ధరలు జూలూ 3 నుంచి అమలులోకి వస్తాయి.
- గతంలో 28 రోజుల పాటు 2 GB డేటా కోసం ప్లాన్ రూ. 155 ఇప్పుడు ధర రూ. 189 అయింది.
- 28 రోజుల వ్యవధిలో రోజుకు 1 GB ప్లాన్ రూ. 209 నుంచి రూ. రూ. 249 పెరిగింది.
- 28 రోజుల వ్యవధిలో 1.5 GB ప్లాన్ రూ. 239 నుంచి రూ. 299కి పెరిగింది
- 28 రోజుల వ్యవధిలో రోజుకు 2 GB ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుంచి రూ. 349కి పెరిగింది.
జియో రెండు నెలల ప్రణాళికలు కూడా విడిచిపెట్టబడలేదు.
- రోజుకు రూ.479 ఉండే 1.5 జీబీ ప్లాన్ ఇప్పుడు రూ.579.
- రోజుకు 2 జీబీ ప్లాన్ రూ.533 నుంచి రూ.629కి పెంచారు
- అదనంగా మూడు నెలల 6 జీబీ డేటా ప్లాన్ ఇప్పుడు రూ.479.. మునుపటి ధర రూ.395.
- రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 349 నుంచి రూ. 399కి పెంచారు.
- రోజుకు 3 GB ప్లాన్ రూ. 399 నుంచి రూ. 449కి పెరుగుతోంది.
ఈ మార్పులు భారీ డేటా వినియోగదారులకు నెలవారీ ఖర్చులలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తాయి.
Annual ప్లాన్లు కొన్ని బాగా పెరిగాయ్
- రూ. 1559 ధర 336 రోజుల 24 GB డేటా ప్లాన్ ఇప్పుడు రూ. 1899 లకు పెరిగింది.
- 365 రోజుల, రోజుకు 2.5 GB ప్లాన్ రూ. 2999 నుండి రూ. 3599కి గణనీయంగా పెరిగింది.
డేటా యాడ్-ఆన్‌లు కూడా పెరిగాయ్..
- 1 GB యాడ్-ఆన్ ధర రూ. 15 నుండి రూ. 19 అవుతుంది .
- 2 GB యాడ్-ఆన్ రూ. 25 నుంచి రూ. 29కి పెరుగుతుంది.
- 6 GB యాడ్-ఆన్ ధర రూ. 61 నుండి రూ. 69కి పెరిగింది.
పెరిగిన రీచార్జ్ ధరలను చూసి జియో నెట్ వర్క్ వినియోగదారులు లబోదిబో మంటున్నారు.