
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే టారిఫ్ లను భారీగా పెంచింది. 1 GB డేటాను మొన్నటి వరకు రు. 11 కి అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులకు షాకిచ్చింది. అయితే తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 MB డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 GB డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు రూపాయితో రీఛార్జ్ చేసుకుని 28 రోజుల వ్యాలిడిటీని.. 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. ఒక రూపాయితో రీఛార్జ్ చేసుకోవాలనే వినియోగదారులు మొదటగా మై జియో యాప్ లోకి ఎంటరవ్వాల్సి ఉందని సంస్థ తెలిపింది. అందులో అదుర్స్ లో వాల్యూ అనే సెక్షన్ ఉందని..దాన్ని ఓపెన్ చేస్తే అందులో రూపాయి రీఛార్జ్ ప్యాక్ కన్పిస్తుందని తెలిపింది.