ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్​తో ఇలా కూడా చేయొచ్చా..?

ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్​తో ఇలా కూడా చేయొచ్చా..?

టీవీ రిమోట్​తో ఛానెల్స్ మాత్రమే కాదు.. యూట్యూబ్​, ఓటీటీ యాప్స్ కూడా ఓపెన్ చేయడం గురించి తెలిసిందే. అంతేనా.. రిమోట్​తోనే బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్​డ్​ ఫీచర్​ వచ్చేసింది. అదేంటంటే.. టీవీ రిమోట్​తో హార్ట్​బీట్​ చెక్ చేసుకోవచ్చు! అవాక్కయ్యారా? కానీ, ఇది నిజమే. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ కాలుక్యులేట్ చేసి టీవీ స్క్రీన్​ మీద చూపిస్తుంది. అంతే కాదండోయ్.. ఈ ఒక్క రిమోట్​తో మరెన్నో చేయొచ్చట. అవేంటో తెలుసుకుందాం.

జియో “TV-OS” పేరుతో కాస్టింగ్ డివైజ్​ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది సెటప్ బాక్స్ గా కూడా పనిచేస్తుంది. ఈ జియో డివైజ్​తో మెయిన్ డోర్ కెమెరా కూడా కనెక్ట్ చేయొచ్చు. టీవీ చూస్తున్నప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే.. డోర్ అవతలి వైపు ఉన్న వ్యక్తి టీవీ తెరపై ఉన్న విండోలో కనిపిస్తారు. అంతేకాదు కాలింగ్ బెల్ నొక్కిన వ్యక్తితో టీవీ నుంచే మాట్లాడొచ్చు. డోర్ ఓపెన్ చేయాలంటే ‘ఓపెన్ ద డోర్’ అని చెప్తే తలుపు తెరుచుకుంటుంది. 

అంతే కాకుండా ఆరోగ్యానికి సంబంధించి లైవ్​లో బ్లడ్​ ఆక్సిజన్​ లెవల్(spo2), హార్ట్​బీట్​ కూడా  చెక్ చేసుకోవచ్చు. రిమోట్ చేతిలో పట్టుకొని సినిమాలు చూస్తున్నప్పుడు మీ బీపీ లెవల్స్ ఎలా పెరుగుతున్నాయి? అన్నది టీవీ స్క్రీన్ పై కనిపిస్తుంది. బీపీ మానిటరింగ్ చేసి నెల రోజుల వరకు ఇదే డివైజ్​లో సేవ్ చేసుకోవచ్చు.  ఇక ఇదే రిమోట్‌‌తో గేమ్స్ జాయ్ స్టిక్ లేకుండా ఆడుకోవచ్చు. 

దీంతోపాటు ఇది గూగుల్ ఓఎస్, వెబ్ ఓఎస్ తరహాలో జియో ప్రత్యేకంగా రూపొందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌తో మీరు చూస్తున్న కంటెంట్‌‌కు సంబంధించిన వీడియోలను, సినిమాలను ఎప్పటికప్పుడు మీకు ప్రత్యేకమైన లిస్ట్ రూపంలో అందజేస్తుంది. దీనికి తెలుగుతోపాటు ఇంకా దాదాపు అన్ని భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు.