Jio new plans: రిలయన్స్ జియో నెట్ వర్క్ ఇటీవల రీచార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీని తర్వాత అయితే జియో తన కస్టమర్ల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా కొత్త ప్లాన్లను తీసుకొస్తుంది. జియో 98 రోజులు, జియో 72 రోజులు రీచార్జ్ కొత్త ప్లాన్లను ప్రారంభించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
జియో 98 రోజుల ప్లాన్
కొత్తగా ప్రారంభించిన ఈ ప్లాన్ ధర రూ. 999 లు. ఈ ప్లాన్ ద్వారా జియో కస్టమర్లు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, మొత్తంగా 98 రోజుల పాటు 198 GB డేటాను అందిస్తుంది. దీంతో పాటు రోజుకు 100 ఫ్రీ SMSలు పంపించొచ్చు. ఈ ప్లాన్ తో పాటు ఓ ప్రత్యేక ఫీచర్ ను కూడా అందిస్తోంది. అదేంటంటే.. స్పీడ్ ఇంటర్నెట్ ను అందించేదుకు అన్ లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు.
జియో 98 రోజుల ప్లాన్ బెనిఫిట్స్
- ధర: రూ. 999
- వ్యాలిడిటీ : 98 రోజులు
- డేటా: రోజుకు 2GB ( 98 రోజుల పాటు )
- వాయిస్ కాలింగ్: అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
- SMS: రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు( 98 రోజుల పాటు)
- 5G డేటా: అన్ లిమిటెడ్ డేటా యాక్సెస్
- సబ్ స్క్రిప్షన్ ఆఫర్ : జియో టివీ, జియో సినిమా, జియో క్లౌడ్ లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్
జియో 72 రోజుల ప్లాన్
98 రోజులు రీచార్జ్ ప్లాన్తోపాటు రిలయన్స్ జియో.. మరో ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. అదే 72 రోజుల రీచార్జ్ ప్లాన్.. దీని ధర రూ. 749. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2GBడేటా పొందవచ్చు. దీంతోపాటు 20GB అదనపు డేటా కూడా లభిస్తుంది. అంటే 72 రోజుల కాలంలో మొత్తంగా 164 GBల డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ కూడా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు,అన్ లిమిటెడ్ 5G డేటా అందించబడుతుంది.
జియో 72రోజుల ప్లాన్ బెనిఫిట్స్ :
- జియో 72రోజుల ప్లాన్ ధర రూ.749
- వ్యాలిడిటీ: 72 రోజులు
- డేటా: రోజుకు 2GB డేటా తోపాటు 20GB డేటా అదనంగా లభిస్తుంది (164GB)
- వాయిస్ కాల్స్ : అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
- SMS: రోజుకు 100 ఎస్ ఎంఎస్ లు ఉచితం.
- 5G డేటా : అన్ లిమిటెడ్ యాక్సెస్
- సబ్ స్క్రిప్షన్ ఆఫర్ : ఈ ప్లాన్ లో కూడా జియో టివీ, జియో సినిమా, జియో క్లౌడ్ లకు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
అదనపు 5G డేటా ప్రయోజనాలు:
98 రోజులు, 72 రోజుల ప్లాన్స్ రెండింటిలో అన్ లిమిటెడ్ 5G డేటాతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. యూజర్లు ఎలాంటి అవాంతరం లేని హైస్పీడ్ కనెక్టివిటినీ ఎంజాయ చేయొచ్చు. దీంతోపాటు టీవీ చేసేందుకు జియో టీవి, జియో సినిమా ద్వారా లేటెస్ట్ మూవీలు, షోలు ఎంజాయ్ చేయొచ్చు. జియో క్లౌడ్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
కొత్త ఆఫర్లతో డేటా ఇంటెన్సివ్ యూజర్లకు నిరంతరాయంగా కనెక్టివిటీ, ఎంటర్ టైన్ మెంట్ ఆప్షన్లను కోరుకొనే వారికి అందించేందుకు యూజర్ బేస్డ్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తూ ఉంది.