జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..

జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..

దేశంలో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగాక మొబైల్ కు రీఛార్జ్ చేయించడం అనేది కూడా మధ్య తరగతి ప్రజలకు భారంగా మారంది. డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నా ఒక్క సిమ్కు రీఛార్జ్ చేయించుకోవాలన్నా ఆలోచనలో పడుతున్న పరిస్థితులున్నాయి. రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఏకంగా 25 శాతం మేర పెరగడంతో సామాన్యులు రీఛార్జ్ చేయించడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. కీ ప్యాడ్ ఫోన్లలో వాడుతున్న సిమ్స్కు కూడా అవసరం లేకున్నా  డేటాతో కూడిన ప్లాన్లతో రీఛార్జ్ చేయించాల్సి వస్తుంది. ఇలా ఇబ్బందిపడుతున్న కస్టమర్లు జియో భారత్ ఫోన్ ఒకటి కొనుక్కుని 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవడం బెటర్. 336 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ఉంది.

రోజుకు 0.5జీబీ హై స్పీడ్ డేటా, 100 ఫ్రీ SMSలు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం. వాయిస్ కాల్స్ చాలు, ఇంటర్నెట్ అవసరం లేదని భావిస్తుంటే మాత్రం జియో భారత్ ఫోన్ ఒకటి కొనుక్కుని 1234 రూపాయల రీఛార్జ్ చేసుకోవడం మేలు. ఎందుకంటే.. రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్లను ఒకసారి పరిశీలిస్తే.. ఏడాది ప్లాన్లు జియోలో తక్కువ రేట్లేమీ లేవు. జియో ఫోన్లో కాకుండా రెగ్యులర్ స్మార్ట్ ఫోన్లలో వాడే జియో సిమ్కు ఏడాది వ్యాలిడిటీ ఉండే ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవాలంటే 3 వేలకు పైమాటే. రీచార్జ్‌‌‌‌ రేట్లను రిలయన్స్ జియో భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అన్ని ప్లాన్ల ధరలు 25% వరకు పెరిగాయి. సవరించిన రేట్లు జులై 3, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. 

ప్లాన్ల ధరలు పెంచక ముందు 28 రోజుల వ్యాలిడిటీ ఉండి, అన్‌‌‌‌లిమిటెడ్  వాయిస్, ఎస్‌‌‌‌ఎంఎస్, 2జీబీ  డేటా అందించే నెలవారీ ప్లాన్ ధర రూ.155గా ఉంది. దీనిని రూ.189 కి పెంచింది. అలానే  రోజుకి  1.5 జీబీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ అందించే  28 రోజుల  వ్యాలిడిటీ ఉండే ప్లాన్ రేటును రూ.209 నుంచి రూ.249 కి పెంచింది.

30 జీబీ అందించే పోస్ట్‌‌‌‌ పెయిడ్ ప్లాన్‌‌‌‌ (బిల్ సైకిల్‌‌‌‌) ను రూ.299 నుంచి రూ.349 కి, 75 జీబీ అందించే ప్లాన్‌‌‌‌ రేటును రూ. 399 నుంచి రూ.449 కి  పెంచింది. రోజుకి 2.5 జీబీ డేటా అందించే, 365 రోజుల వ్యాలిడిటీ ఉండే యాన్యువల్ ప్లాన్ రేటును రూ.2,999 నుంచి రూ.3,599 కి పెంచింది. ఈ కొత్త ప్లాన్ల రేంజ్‌‌  నెలకు  2 జీబీ డేటా ప్లాన్ రూ. 189 నుంచి  రోజుకి 2.5 జీబీ డేటా అందించే యాన్యువల్ ప్లాన్  రూ.3,599 వరకు ఉన్నాయి. రోజుకి 2జీ డేటా లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించే అన్ని ప్లాన్లు  అన్‌‌‌‌లిమిటెడ్‌‌‌‌ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి.