
ముంబై : రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్ లో సంచలనాలు సృష్టిస్తోంది. 4జీ ఫీచర్ ఫోన్ తో 2జీ ఫీచర్ ఫోన్ యూజర్లను వేగవంతంగా 4జీ నెట్ వర్క్‌లోకి రిలయన్స్ జియో ఆకట్టుకుంటోంది. 2017 చివరి నుంచి ఇప్పటి వరకు సుమారు 5 కోట్ల స్మార్ట్ ఫీచర్ ఫోన్ యూజర్లను ఈ కంపెనీ దక్కించుకున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ తాజా డేటాలో వెల్లడైంది.కంపెనీకి చెందిన జియో ఫోన్ కియో ఓఎస్ ఆధారితంగా పనిచేసే స్మార్ట్ ఫీచర్ ఫోన్. రూ.1500 ధరతో దీన్ ని లాంచ్ చేసింది. లాంచ్ చేసినప్పటి నుంచి, జియోకు యాడ్ అయిన 10 కోట్ల మంది సబ్ స్క్రయిబర్లలో, సగం మంది ఈ ఫోన్ నుంచే వచ్చారని కౌంటర్ పాయింట్ తెలిపింది.