మీ దగ్గర జియో ఫోన్ ఉందా..? అయితే పండగేగా..!

మీ దగ్గర జియో ఫోన్ ఉందా..? అయితే పండగేగా..!

మీ దగ్గర రిలయన్స్ జియో ఫోన్ ఉందా..? జియో ఫోన్ ఉంటే ఇది నిజంగా గుడ్ న్యూసే. జియో ఫోన్ ఉండి.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చాలనుకునేవారికి శుభవార్త. రూ.895తో రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అంటే కేవలం రోజుకు మహా అయితే 2 రూపాయలు చెల్లించి నిరంతర కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడున్న టారిఫ్ ధరలతో పోల్చితే చాలా చీప్ అని చెప్పక తప్పదు. 336 రోజులకు గానూ 24 జీబీ హైస్పీడ్ డేటా కూడా వస్తుంది. 28 రోజులకు 2జీబీ డేటా అనమాట. 

జస్ట్ బ్రోజింగ్కు, మెసేజింగ్కు ఇంటర్నెట్ వాడుకునే వారికి ఈ పరిమిత డేటా దాదాపుగా సరిపోవచ్చు. 336 రోజుల పాటు ప్రతీ 28 రోజులకు 50 ఎస్ఎంఎస్లు చేసుకునే వెసులుబాటు కూడా ఈ ప్లాన్లో ఉంది. జియో యాప్స్ను కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ యాప్స్ను ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. 

ALSO READ | స్మార్ట్ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బంపర్ ఆఫర్

జియో కస్టమర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఓన్లీ జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ 895 రూపాయల వార్షిక ప్లా్న్ అందుబాటులో ఉంది. ఇవే బెన్ ఫిట్స్ కలిగిన సేమ్ ప్లాన్ జియో ప్రీపెయిడ్ సిమ్ యూజర్లకు 1899 రూపాయలకు అందుబాటులో ఉంది. జియో వాల్యూ ప్యాక్స్ విభాగంలో ఈ ప్లాన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. 479 రూపాయల ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, 6 జీబీ డేటాతో.. 189 రూపాయల ప్లా్న్ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, 2జీబీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండటం గమనార్హం.