ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం.. ఒక్కటైన జియో, ఏఎండీ, సిస్కో, నోకియా

ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం.. ఒక్కటైన జియో, ఏఎండీ, సిస్కో, నోకియా

న్యూఢిల్లీ: ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌ కోసం జియో ప్లాట్‌‌ఫారమ్స్​,  ఏఎండీ, సిస్కో,  నోకియా జతకట్టాయి.  ఇది నెట్‌‌వర్క్ భద్రతను,  సామర్థ్యాన్ని పెంచుతుందని, టెక్నాలజీ ఖర్చులను తగ్గిస్తుందని భావిస్తున్నారు. మల్టీ-డొమైన్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్‌‌వర్క్ నెట్‌‌వర్క్ వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుందని మంగళవారం ఇవి విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఏఎండీ, సిస్కో, నోకియాతో కలిసి, జియో ఓపెన్ టెలికాం ఏఐ ప్లాట్‌‌ఫామ్‌‌ను అభివృద్ధి చేస్తోంది. 

దీనివల్ల మరింత సమర్థమైన నెట్​వర్క్​ను అందించవచ్చని రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ ఊమెన్ ప్రకటనలో తెలిపారు. నోకియా సీఈఓ పెక్కా లండ్‌‌మార్క్ మాట్లాడుతూ,  ఆర్​ఏఎన్​, కోర్, ఫిక్స్‌‌డ్ బ్రాడ్‌‌బ్యాండ్, ఐపీ  ఆప్టికల్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌తో సహా పలు టెక్నాలజీల్లో తమకు మంచి పట్టు ఉందని అన్నారు.  ఏఎండీ చైర్  సీఈఓ లిసా సు మాట్లాడుతూ, ఈ ప్లాట్‌‌ఫామ్ కోసం కంపెనీ ఎక్కువ సామర్థ్యం గల సీపీయూలను, జీపీయూలను, అడాప్టివ్ కంప్యూటింగ్ సొల్యూషన్‌‌ల పోర్ట్‌‌ఫోలియోను ఉపయోగించుకుంటుందని చెప్పారు.