Jio Prepaid Plans: జియో రూ. 249 vs రూ. 299.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెటర్..?

Jio Prepaid Plans: జియో రూ. 249 vs రూ. 299.. ఏ రీఛార్జ్ ప్లాన్ బెటర్..?

ఈ రోజుల్లో రీఛార్జ్ ధరలు ఎంత పిరమయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంట్లో నలుగురు ఉండి అందరూ స్మార్ట్ ఫోన్ వాడేవారైతే.. ఆ కుటుంబ ఆదాయంలో నెలనెలా రెండు వేలు ఎగిరినట్లే. ఆ స్థాయిలో రీఛార్జ్ ధరలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో అవసరానికి తగ్గ ప్లాన్ ఎంచుకోవడం ఎంతో అవసరం. ఇప్పుడు టెలికాం కంపెనీ జియో అందిస్తోన్నరెండు ప్లాన్లు రూ. 249 vs రూ. 299లలో ఏది ఎంచుకుంటే ఉత్తమమనేది తెలుసుకుందాం..

ALSO READ : Adani Vs Hindenburg: అదానీ స్విస్ అకౌంట్లు సీజ్ అంటున్న హిండెన్ బర్గ్.. అదేం లేదన్న అదానీ

జియో రూ. 249 ప్లాన్:

28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోన్న ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆస్వాదించవచ్చు. అదనంగా రోజుకు 1GB డేటా చొప్పున 28GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎం ఎస్ లు ఉచితంగా పంపుకోవచ్చు. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా పొందవచ్చు.

జియో రూ. 299 ప్లాన్:

రూ. 299 రీఛార్జ్ ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. మీరు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా రోజుకు 1.5GB డేటా చొప్పున 28 రోజులకు 42GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎం ఎస్ లు ఉచితంగా పంపుకోవచ్చు. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా పొందవచ్చు.

ఏది బెటర్..?

ఈ రెండింటిలో మీకు డేటా పరిమిత స్థాయిలో అవసరమైతే రూ. 249 ప్లాన్ ఎంచుకోవడం ఉత్తమం. అదే మీకు డేటా మరింత అవసరమనుకుంటే రూ. 299 ప్లాన్ ఎంచుకోండి. వినియోగదారులు పరిమిత స్థాయిలో డేటా ఉపయోగం ఉందనుకుంటే రూ. 479 రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవడం ఇంకా బెటర్. ఇది 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. 6GB డేటా వస్తుంది.