జియో నెట్ వర్క్ సంస్థ 498రూపాయల ఫ్రీగా రీ ఛార్జ్ చేస్తుందంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మెసేజ్ తో ఫ్రీ గా రీ ఛార్జ్ చేసుకునేందుకు వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు.
లాక్ డౌన్ సందర్భంగా పేదలకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా సంక్షేమ నిధిని కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా వినియోగదారులకు జియో రూ.498 ఫ్రీ గా రీఛార్జ్ చేస్తున్నారంటూ ఓ మెసేజ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
వాట్సాప్ లో షేర్ అవుతున్న లింక్ ను క్లిక్ చేస్తే ఈ ఆఫర్ ను పొందవచ్చని.. ఆఫర్ మార్చి 31 వరకు చెల్లుతుందని మెసేజ్ లో ఉంది.
ఆ మెసేజ్ తో జియో కి సంబంధం లేదు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్రీ రీఛార్జ్ పై జియో సంస్థ స్పందించింది. కరోనా వైరస్ అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ప్రకటించిన జియో.. వైరల్ అవుతున్న మెసేజ్ కు జియో సంస్థకు సంబంధంలేదని తెలిపింది.
ముఖేష్ అంబానీ ప్రొఫైల్ తో వెబ్ సైట్ లింక్
jiofreerecharges.online పేరుతో ముఖేష్ అంబానీ ప్రొఫైల్ ఉన్న వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేస్తే కష్టమర్ డీటెయిల్స్ అడుగుతుంది. దీంతో ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకునేందుకు నెటిజన్లు జియో సంస్థ ట్వీట్టర్ ట్యాగ్ చేశారు. దీంతో స్పందించిన జియో సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న మెసేజ్ కు తమకు సంబంధం లేదని అధికారికంగా ప్రకటించారు.