న్యూ ఇయర్ గిఫ్ట్గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు

న్యూ ఇయర్ గిఫ్ట్గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు

ఓటీటీ వ్యూవర్స్ కు షాకింగ్ న్యూస్. ఓటీటీ ఛానల్స్ ఇప్పుడున్న ఛార్జీలను భారీగా పెంచి కస్టమర్లకు షాకింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. అయితే ఈ బాదుడు ముందుగా రిలయన్స్ జియో స్టార్ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అదే బాటలో మిగతా ఛానల్స్ పెంచనున్నాయి.

ఇటీవలే రిలయన్స్ వయకామ్18 - హాట్ స్టార్ చర్చలు ఫలించి విలీనం పూర్తయిన విషయం తెలిసిందే. ఈ విలీనం తర్వాతం ఏర్పడిన జాయింట్ వెంచర్ ‘జియోస్టార్’ అనే పేరుతో ఇకనుంచి సేవలు అందిస్తుంది. మెర్జర్ పూర్తియిన వెంటనే జియో స్టార్ ఛార్జీల బాదుడు మొదలు పెట్టింది.

జియోస్టార్ కస్టమర్లకు ఎంటర్టైన్ మెంట్, న్యూస్, స్పోర్ట్స్ మొదలైన వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన134 ఛానల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఛానల్స్ కోసం 83 రీచార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. 

ఈ ప్యాక్ లలో స్టార్ వాల్యూ ప్యాక్ (SVP) హిందీ, SVP హిందీ బేసిక్ ప్యాక్స్ ధరను రూ.110 గా నిర్ణయించింది. అంటే ఇంతకు ముందు ఉన్న ప్యాక్స్ తో పోల్చితే 18 శాతం పెంచినట్లు సంస్థ ప్రకటించింది. జియో స్టార్ స్టార్ ప్లస్, కలర్స్, స్టార్ గోల్డ్, స్టార్ స్పో్ర్ట్స్ తదితర పాపులర్ ఛానల్స్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ తదితర సంస్థలనుంచి క్రికెట్ రైట్స్ పొందడంతో.. ఇతర ఛానల్స్ తో పోల్చితే ప్రీమియం ధరలతో కస్టమర్లనుంచి వసూలు చేసేందుకు సిద్ధమయ్యింది. 

జియో స్టార్ బాటలోనే జీ, సోనీ:

ఏ ఇండస్ట్రీలో అయినా ముందుగా ఒకరు పెంచితే అదే అదనుగా మిగతా సంస్థలు పెంచడం ఆనవాయితి. ఇప్పుడు అదే బాటలో ఇతర ఓటీటీ సంస్థలు, ఛానల్స్ ఛార్జీలను బాదేందుకు సిద్ధమయ్యాయి. జీ ఎంటర్టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఛార్జీలను 10 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించాయి. అయితే ఫైనల్ రేట్లు డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్ కాస్టర్లతో చర్చించాక ప్రకటించనున్నాయి. స్వల్ప మార్పులు తప్ప దాదాపు ఇవే రేట్లు ఉండొచ్చునని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.