Jio Star: ఓటీటీలో కొత్త సంచలనం.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌‌‌ దూకుడిని ఆపేలా ‘జియో స్టార్’ తెరపైకి!

Jio Star: ఓటీటీలో కొత్త సంచలనం.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌‌‌ దూకుడిని ఆపేలా ‘జియో స్టార్’ తెరపైకి!

ఇప్పుడుప్రేక్షకుల ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడంతా ఓటీటీకే(OTT)ఓటేస్తున్నారు. ఓటీటీ ఉంటే.. టీవీ, మొబైల్​లో పాత, కొత్త సినిమాలు, వెబ్ ‌‌సిరీస్​లు ఎప్పుడు కావాలంటే.. అప్పుడు చూడొచ్చు. అందుకే రోజురోజుకూ ఓటీటీకి ఆదరణ పెరుగుతోంది. అంతెందుకు గ్లోబల్ ఎంటర్​టైన్మెంట్​ మార్కెట్​‌‌లో కూడా ఓటీటీదే హవా. ఓటీటీ మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ఇండియాలో అమెరికన్‌‌‌‌ ఓటీటీ సర్వీస్‌‌‌‌లు నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ వీడియో వంటివి బాగా ఫేమస్‌‌‌‌ అయ్యాయి. వీటితో పోటీ పడుతూనే ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులు విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్‌‌‌‌, కంటెంట్‌‌‌‌లను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఇండియా వెలుపల కూడా ఫేమస్‌‌‌‌ అవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులకు మంచి ఆదరణ దక్కుతోంది.

ఇప్పటికే జీ5, ఆహా, ఆల్ట్‌‌‌‌బాలాజి, ఈరోస్‌‌‌‌ నౌ, హంగామా ప్లే వంటి ఓటీటీ సర్వీసులు ఇండియన్‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌ దాటి ఆదరణ పొందుతున్నాయి. అమెరికా, ఇంగ్లండ్‌‌‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, సౌతాఫ్రికా వంటి దేశాలలో ఈ సర్వీసులకు మంచి వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ఉంది. హిందీ, తమిళ, తెలుగు సినిమాలు ఈ దేశాలలో మంచి ఆదరణ లభిస్తోంది. షారుక్‌‌‌‌ ఖాన్‌‌‌‌, రజనీకాంత్‌‌‌‌, చిరంజీవి, ఎన్టీఆర్​, ప్రభాస్​, మహేశ్​బాబు, పవన్​కల్యాణ్​​వంటి పెద్ద స్టార్ల సినిమాలు ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులకు కాసులు కురిపిస్తున్నాయి. 

ఇపుడు లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఓటీటీలో బిగ్ డీల్ తెరపైకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఓటీటీల్లో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. మరో రెండు ఫేమస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తమ దూకుడును కొనసాగిస్తుండగా.. వీటిని వెనక్కి నెట్టేలా డిస్నీ+హాట్‌స్టార్‌, జియో సినిమా రెండూ సంయుక్తంగా కలిసి ఒకే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘జియో స్టార్’ (Jio Star) పేరుతో వచ్చేందుకు డీల్ కుదూర్చుకున్నాయి. ఈ మేరకు కొత్త డొమైన్ కూడా నవంబరు 14 నుంచి ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది.

అంటే.. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇప్పుడు జియో స్టార్ రాకతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మరింత పోటీ పెరగనుంది. ఇక ఈ డెసిషన్ తో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన ముద్ర చూపించడానికి ముఖేష్ అంబాని పెద్ద ప్లాన్ వేసినట్లు ఈ ఏడాది మొదటి నుంచే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్ తో.. మేకర్స్ ఓటీటీ ఆడియన్స్ కోసం ఎలాంటి కంటెంట్ తో ముందుకు రానున్నారో చూడాలి.