దేశీయ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలియన్స్ జియో(Reliance Jio) తమ వినియోగదారులకు షాకిచ్చింది. 199 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను మరింత ఖరీదైనదిగా మార్చేసింది. ఒక్కసారిగా రూ.100 పెంచి.. ఇకమీదట రూ.299 అని చెప్పింది. దీనికి జిఎస్‌టీ(GST) అదనం. పెంచిన ధరలు జనవరి 23 నుండి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం రూ.199 ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు ఆటోమేటిక్‌గా రూ.299 ప్లాన్‌కి మైగ్రేట్ చేయబడతారు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెలకు 25GB డేటాను అందిస్తోంది. ఒకవేళ ఇచ్చిన డేటా అయిపోయి అదనంగా వాడాల్సి వస్తే.. 1 GBకి రూ. 10 చొప్పున ఛార్జ్ చేయబడుతుంది.
కొత్తగ చేరే వారు.. రూ. 349
కొత్తగా చేరే కస్టమర్లకు రూ. 299 ప్లాన్ అందుబాటులో ఉండదు గమినించగలరు. బదులుగా బేస్ ప్లాన్ ఇప్పుడు రూ. 349తో ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెలకు 30GB డేటా అందిస్తున్నారు.
ఫ్యామిలీ ప్లాన్.. రూ. 449
మీ ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జియో వినియోగధారులైతే.. ఈ ఫ్యామిలీ ప్లాన్ ఎంచుకోవడం ఉత్తమం. జియో నెలకు రూ. 449 ధరతో అత్యంత సరసమైన ఫ్యామిలీ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో గరిష్టంగా మూడు అదనపు నంబర్లు జోడించవచ్చు. ఈ ప్లాన్‌లో నెలకు 75GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, 5G సేవలు ఉన్నాయి.
ALSO READ | టెల్కోలకు రూ.లక్ష కోట్ల బూస్ట్ ?: వొడాఫోన్ ఐడియాకు ఎంతో మేలు