ఘనాకు జియో టెక్నాలజీ

ఘనాకు జియో టెక్నాలజీ

ముంబై : తమ దేశంలో 4జీ,  5జీ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రిలయన్స్ జియో అనుబంధ సంస్థ, టెక్ మహీంద్రా,  ఇతర సంస్థలతో ఆఫ్రికా దేశం ఘనా ఒప్పందాలు కుదుర్చుకుంది. తమ దేశ సంస్థ నెక్స్ట్-జెన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (ఎన్జీఐసీ) చౌకగా 5జీ మొబైల్ బ్రాడ్‌‌‌‌బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కోసం జియో సంస్థ రాడిసిస్, టెక్ మహీంద్రా

నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుందని ఘనా కమ్యూనికేషన్,  డిజిటలైజేషన్ మంత్రి ఉర్సులా ఓవుసు-ఎకుఫుల్ ముంబైలో వెల్లడించారు. ఎన్జీఐసీకి 5జీ స్పెక్ట్రమ్ వచ్చిందని, వచ్చే ఆరు నెలల్లో సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి స్థానిక టెల్కోలు షేర్డ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను ఉపయోగించుకుంటాయని వివరించారు.