Airtel vs Jio: ఎయిర్‌టెల్ vs జియో.. ఏది రీఛార్జ్ చేసుకుంటే బెటర్!

Airtel vs Jio: ఎయిర్‌టెల్ vs జియో.. ఏది రీఛార్జ్ చేసుకుంటే బెటర్!

టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ పోటీ పడి రీఛార్జ్ ధరలను పెంచుతూ సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నాయి. అంబానీ సంస్థ జియో మొబైల్ టారిఫ్‌లను 12 నుండి 27 శాతం పెంపుతున్నట్లు ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. ఎయిర్‌టెల్ రీఛార్జ్ టారిఫ్‌లను 10 నుండి 21 శాతం వరకు పెంచింది. ఈ కొత్త టారిఫ్‌లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చే ప్లాన్స్ ఏంటి..? తక్కువ భారం పడే రీఛార్జ్ ప్లాన్ ఏవో తెలుసుకుందాం..

Airtel vs Jio కొత్త పాపులర్ టారిఫ్ ప్లాన్స్

28 రోజుల వ్యాలిడిటీ

  • రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.299/ జియో రూ.249
  • రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.349/ జియో రూ.299

56 రోజుల వ్యాలిడిటీ

  • రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.579/ జియో రూ.579
  • రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.649/ జియో రూ.629

84 రోజుల వ్యాలిడిటీ

  • రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.859/ జియో రూ.799
  • రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.979/ జియో రూ.859

365 రోజుల వ్యాలికిడీ

  • రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఎయిర్‌టెల్: రూ.3599/ జియో రూ.3599

గమనిక: రిలయన్స్ జియో 2GB/రోజు మరియు అంతకంటే ఎక్కువ ప్లాన్‌లపై అపరిమిత 5Gని అందిస్తుండగా..  ఎయిర్‌టెల్ఇంకా ఎటువంటి అపరిమిత 5G డేటా ఆఫర్లను పేర్కొనలేదు. పై రీఛార్జ్ ధరలను బట్టి చూస్తే.. ఎయిర్‌టెల్ తో పోలిస్తే జియోలో ప్లాన్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఆయా టెలికాం కంపెనీల నెట్ వర్క్, సర్వీస్ లను బట్టి ఏది వాడాలనేది వినియోగదారుల ఇష్టం.