Jio: జియో నుంచి దీపావళి గిఫ్ట్.. నిజంగానే పండగ చేస్కోండి..!

మన దేశంలో 4జీ అందుబాటులోకి వచ్చాక లక్షల మంది 2జీ యూజర్లు 4జీకి మారిపోయారు. 4జీ సేవలను మరింత విస్తృతంగా తీసుకెళ్లే ఉద్దేశంతో రిలయన్స్ జియో.. జియో భారత్ దివాళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. జియోభారత్ 4జీ ఫోన్ ధరను దీపావళి సందర్భంగా 999 రూపాయల నుంచి 699 రూపాయలకు రిలయన్స్ జియో తగ్గించడం విశేషం. ఇది లిమిటెడ్ టైం ఫెస్టివ్ ఆఫర్ అని జియో ప్రకటించింది. హై స్పీడ్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, డిజిటల్ ఫీచర్స్ ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.

Also Read :- ఆర్థిక సాయం చేసి కుక్కను కాపాడండి..: భారత క్రికెటర్ సోదరి

దీపావళి సందర్భంగా జియోభారత్ ఫోన్ ధరను తగ్గించడమే కాదు 123 రూపాయల మంత్లీ సబ్స్క్రిప్షన్ బెన్ఫిట్స్ కూడా వినియోగదారులు పొందొచ్చని జియో తెలిపింది. అక్టోబర్ 14న రిలయన్స్ జియో జియోభారత్ వీ3, జియోభారత్ వీ4 మోడల్స్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ ఫోన్స్ ధర రూ.1,099.  

జియోభారత్ ఫోన్ మంత్లీ సబ్స్క్రిప్షన్ బెన్ఫిట్స్:
* అపరిమిత వాయిస్ కాల్స్
* నెలకు14 GB డేటా
* 455 లైవ్ టీవీ ఛానల్స్
* ప్రీమియర్స్ అండ్ లేటెస్ట్ మూవీస్
* వీడియో షోస్ అండ్ లైవ్ స్పోర్ట్స్
* జియో సినిమా హైలైట్స్
* డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ స్కానింగ్
* జియోపే పేమెంట్స్ సౌండ్ అలర్ట్స్
* గ్రూప్ చాట్ ఫీచర్స్
* జియో చాట్ నుంచి వీడియోలు, ఫొటోలు, మెసేజెస్ ఈజీ షేరింగ్