![JioHotstar: జియో హాట్స్టార్ లాంచ్..ఒకే ఫ్లాట్ ఫాం రెండు ఓటీటీల కంటెంట్..సబ్ స్క్రిప్షన్ ఫ్రీ!](https://static.v6velugu.com/uploads/2025/02/jiohotstar-streaming-platform-launched-combines-jiocinema-and-disney-hotstar_lNF4Pxh1qL.jpg)
కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియో హాట్స్టార్ లాంచ్ అయింది..శుక్రవారం ( ఫిబ్రవరి 14) న జియో హాట్స్టార్ దీనిని ప్రారంభించింది. జియో సినిమా,డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి ఈ కొత్త ప్లాట్ ఫాం ను రూపొందించారు. ఈ రెండు ప్లాట్ ఫాం లు కలవడంతో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకనుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.
ఈ కొత్త ప్లాట్ ఫాం జియో హాట్‌స్టార్‌లో 100 లైవ్ టీవీ ఛానెల్స్, 3లక్షల గంటలకు పైగా కంటెంట్ ఉంటుంది.ఇప్పటివరకు ఐపీఎల్ సహా ఇండియా క్రికెట్ మ్యాచ్ ల డిజిటల్ హక్కులు జియో సినిమా కలిగి ఉంది.. ఐసీసీ టోర్నమెంట్ ల హక్కులను డిస్నీప్లస్ హాట్‌స్టార్ కలిగి ఉంది.. ఈ రెండింటి కలయికతో అన్ని మ్యాచ్ లను జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.
ఈ కొత్త ప్లాట్ ఫాం దాదాపు 3లక్షల గంటల కంటెంట్ తో పాటు లైవ్ స్పోర్ట్స్ కవరేజీని అందించనుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి JioHotstar కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. షోలు, సినిమాలు లేదా లైవ్ స్పోర్ట్స్ చూడటానికి కస్టమర్లకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే కంటెంట్ అంతా ఉచితంగా ఇస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
సబ్ స్క్రిప్షన్ విషయానికి వస్తే.. జియో సినిమా,డిస్నీ+ హాట్‌స్టార్ కస్టమర్లంతా ఆటోమేటిక్ గా కొత్త ప్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ లోకి మారుతారు. మొదటిసారి లాగిన్ అయినప్పుడు కొత్త సబ్ స్క్రైబర్లు రూ. 149 నుంచి కొత్త ప్లాన్ ల ద్వారా బ్రౌజ్ చేయొచ్చు. అంటే జియో సినిమా,డిస్నీ+ హాట్‌స్టార్ మొత్తం కస్టమర్లను కలుపుకొని ఈ కొత్త ప్లాట్ ఫాం దాదాపు 50కోట్లకు పైగా కస్టమర్లను కలిగిఉంది. లోగో వచ్చి ఏడు కోణాలనక్షత్రంతో జియో హాట్ స్టార్ అని పదం ఉంటుంది.