![జియో హాట్స్టార్ వచ్చేసింది.. 3 నెలల ప్లాన్ ఎంతంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/jiohotstar-subscription-plan-starting-price-begins-at-rs-149-per-quarter_tVeK3B2mUY.jpg)
జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిసి జియో హాట్స్టార్ (JioHotStar) అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను లాంచ్ చేశాయి. 10 భాషల్లో కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. NBCUniversal Peacock, Warner Bros, Discovery, HBO, Paramount కంటెంట్ కూడా అదనంగా పొందొచ్చు. ఇప్పటివరకూ ఇతర స్ట్రీమింగ్ సర్వీస్ ఏది కూడా ఇంత కంటెంట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురాలేదని జియో హాట్ స్టార్ చెప్పుకొచ్చింది.
సింపుల్గా చెప్పాలంటే.. ప్రస్తుతం ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్.. జియోహాట్ స్టార్గా మారింది. జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ విషయానికొస్తే.. మొబైల్, సూపర్, ప్రీమియం (యాడ్స్ ఫ్రీ) ప్లాన్లను యూజర్లకు అందుబాటులో ఉంచింది. మొబైల్, సూపర్, ప్రీమియం (యాడ్స్ ఫ్రీ) ప్లాన్ల ధరలపై ఓ లుక్కేద్దాం.
మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటైల్స్:
* 3 నెలలకు 149 రూపాయలు
* సంవత్సరం ప్లాన్ 499 రూపాయలు
* ఒక మొబైల్ డివైజ్కు మాత్రమే
* మొబైల్ ఓన్లీ
* విత్ యాడ్స్
* హెచ్ డీ 720 పిక్సెల్
సూపర్ ప్లాన్ డీటైల్స్:
* 2 డివైజెస్లకు అనుమతి (టీవీ, ల్యాప్టాప్ లేదా మొబైల్)
* 3 నెలలకు 299 రూపాయలు
* ఏడాది ప్లాన్ 899 రూపాయలు
* విత్ యాడ్స్
* ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ క్వాలిటీ 1080 పిక్సెల్
* Dolby Atmos
ప్రీమియమ్ ప్లాన్ డీటైల్స్:
* 3 నెలలకు 499 రూపాయలు
* సంవత్సరానికి 1499 రూపాయలు
* 4 డివైజెస్లకు అనుమతి (టీవీ, ల్యాప్ టాప్, మొబైల్)
* లైవ్ ప్రసారాలకు తప్ప మిగతా కంటెంట్కు నో యాడ్స్ (ఒక్క యాడ్ కూడా రాకుండా కంటెంట్ను వీక్షించవచ్చు)
* 4K 2160p + Dolby Vision క్వాలిటీతో కంటెంట్ను ఆస్వాదించవచ్చు
* Dolby Atmos