- ఓనర్‌షిప్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందుకొచ్చిన అన్నాచెల్లెలు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పాపులర్ అయిన జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్ ఇష్యూకి తాజాగా తెరపడింది. ఢిల్లీ టెకీ నుంచి ఈ డొమైన్‌ను కొనుగోలు చేసిన సిబ్లింగ్స్ జైనమ్, జీవికా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్రీగా ఓనర్‌షిప్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ముందుకొచ్చారు. రిలయన్స్ జియో, డిస్నీ హాట్‌స్టార్ మధ్య విలీన చర్చలు మొదలైనప్పుడే ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ఒకరు జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సటీలో తన చదువుకు అయ్యే ఖర్చులు పెట్టుకుంటే రిలయన్స్‌కు ఈ డొమైన్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తానని కిందటి నెలలో డిమాండ్ చేశారు.
కానీ, రిలయన్స్ మాత్రం ఆయన డిమాండ్‌కు ఒప్పుకోలేదు. దుబాయ్‌లో నివసిస్తున్న సిబ్లింగ్స్ ఈ డొమైన్‌ను కొనుగోలు చేశారు. రిలయన్స్ ఐపీ లీగల్ టీమ్ తమను సంప్రదించిందని, డొమైన్ ఓనర్‌షిప్‌ను రిలయన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేద్దామని నిర్ణయించుకున్నామని ఈ అన్నాచెల్లెలు తాజాగా వీడియో మెసెజ్‌లో పేర్కొన్నారు. అది కూడా ఫ్రీగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. తమను ఎవరూ ఒత్తిడి చేయలేదని అన్నారు. ‘జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకొచ్చారు. కానీ ఎవరికీ అమ్మలేదు.
రిలయన్స్‌కు ఓనర్‌షిప్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి డ్రాఫ్ట్ పేపర్ల కోసం ఎదురుచూస్తున్నాం’ అని వీరు వివరించారు. ఈ ఇష్యూపై రిలయన్స్ కామెంట్ చేయలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా బిజినెస్, వాల్ట్ డిస్నీ ఇండియా బిజినెస్‌లు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాయింట్ వెంచర్ ఇండియాలో అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా మారింది. దీనికి ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంటారు.