రిలయన్స్ జియో.. ఇప్పటికే అనేక స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. వివిధ రకాల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో విస్తృత స్పెక్ట్రమ్ కస్టమర్‌లకు సైతం సేవలు అందిస్తోంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్, డేటా బూస్టర్ ఛాయిస్ లు, డేటా ప్యాక్‌లు లాంటివి చాలా ఉన్నాయి. అందులో భాగంగా తగినంత డేటా, OTT కంటెంట్‌కు యాక్సెస్, పొడిగించిన చెల్లుబాటు వ్యవధిని అందించే రీఛార్జ్ ప్లాన్ కోసం వెతుకుతున్నట్లయితే, వారికి ఇప్పుడు జియో ఓ కొత్ ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.1,499 ప్లాన్ ఇప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
ఆల్ ఇన్ వన్ ప్రయోజనాలు
జియో రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్ అనేది OTTలతో పాటు, సుదీర్ఘమైన చెల్లుబాటు వ్యవధి, తగినంత డేటాను కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపిక. ఈ ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లు దాదాపు 3 నెలలు అంటే 84 రోజుల పాటు ఈ ప్రయోజనాలను పొందుతారు. ఈ వ్యవధిలో, మొత్తం 252GB డేటాతో.. రోజుకు 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూవారి 100ఎస్ఎంఎస్ లను అందుకుంటారు.
అదనపు ప్రయోజనాలు
జియో రూ. 1499 ప్లాన్ మొత్తం చెల్లుబాటు వ్యవధికి కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కలిగి ఉన్నందున మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, మీరు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు యాక్సెస్ చేయవచ్చు. తక్కువ ధరలో ప్లాన్ లను ఆస్వాదించాలనుకునే వినియోగదారుల కోసం, జియో రూ. 1099 ధరతో ప్రత్యామ్నాయ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజువారీ డేటా 2GB కేటాయింపును అందిస్తుంది. ఇది విభిన్న డేటా వినియోగ అవసరాలను అందిస్తుంది.