
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2025 శనివారం ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ సందర్శంగా మ్యాచ్ లు చూసేందుకు ప్రతిఒక్కరూ స్మార్ట్ టీవీలు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన క్రికెటర్లు ప్రదర్శించే ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సమయంలో ఎటువంటి అంతరాయం లేని నెట్వర్క్, తక్కువ ఖర్చుతో ఉండే రీచార్జ్ ప్లాన్లను ఎంచుకుంటారు.రిలయన్స్ జియో తన యూజర్లకోసం కొత్త రీచార్జ్ ప్లాన్ తో వస్తుంది. IPL 2025 జియో కొత్త రూ.299 ప్లాన్ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రిలయన్స్ జియో రూ. 299తో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ క్రికెట్ అభిమానులకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా IPL2025 మ్యాచులను ఎంజాయ్ చేసేందుకు అందిస్తుంది.
- ఈ ప్లాన్ ద్వారా 28 రోజులు వ్యాలిడిటీ
- రోజుకు 1.5 హైస్పీడ్ డేటా
- అన్ని నెట్వర్క్లకు అన్ లిమిటెడ్ కాల్స్
- 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ అందిస్తుంది.
ఇక క్రికెట్ను అందించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను 90 రోజుల పాటు ఉచితంగా అందిస్తుంది. దీంతో క్రికెట్ అభిమానులు IPL 2025 మ్యాచులను నిరంతరాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అదనంగా జియో టీవీ, జియో క్లౌడ్ యాప్ లను యాక్సెస్ ఉంటుంది.