
న్యూఢిల్లీ: రిలయన్స్, వాల్ట్‌డిస్నీ జాయింట్ వెంచర్ జియోస్టార్ సుమారు 1,100 మంది ఉద్యోగులను తీసేయనుంది. చాలా జాబ్ రోల్స్‌కు ఒకరి కంటే ఎక్కువ మంది పనిచేస్తుండడమే ఇందుకు కారణం. ఉద్యోగుల కోత నెల కిందటే మొదలైంది. ఈ ఏడాది జూన్ వరకు కొనసాగుతుంది. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగుల కోత ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ లెవెల్, సీనియర్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్‌ను కూడా జియోస్టార్ తొలగిస్తోంది.