- నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 9 రాష్ట్రాలకు నియామకాలు
న్యూఢిల్లీ: తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆయనను నియమించారు. అలాగే 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా హరిబాబు కిషన్ రావు బాగ్డే, సిక్కిం గవర్నర్‌గా ఓంప్రకాశ్ మాథుర్, జార్ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గాంగ్వార్, ఛత్తీస్ గఢ్ గవర్నర్‌గా రమణ్ దేకా, మేఘాలయ గవర్నర్‌గా సీహెచ్ విజయ శంకర్ నియమితులయ్యారు.
ప్రస్తుతం జార్ఖండ్‌తో పాటు తెలంగాణకూ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. అసోం గవర్నర్ గులాం చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా నియమించడంతో పాటు చండీగఢ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలుఅప్పగించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్ గా నియమించారు. దాంతోపాటు మణిపూర్ గవర్నర్ గానూ ఆచార్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.