- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- మరో 15 మంది ఐపీఎస్‌లూ బదిలీ
- లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేశ్ భగవత్
- ఏసీబీ డీజీ సీవీ ఆనంద్కువిజిలెన్స్ బాధ్యతలు
- మళ్లీ రాచకొండ కమిషనర్గాసుధీర్ బాబు
- సీఎం రేవంత్‌తో జితేందర్ భేటీ.. డీజీపీగా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియమితులైన తొలి డీజీపీ.. జితేందర్. ఆయన ఇప్పటి వరకు డీజీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్.
1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా పని చేశారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో, 2004–06 వరకు గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు.
పోలీస్ అకాడమీలో కొంతకాలం పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా ఉన్నారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అడిషనల్కమిషనర్గా విధులు నిర్వర్తించారు.
తెలంగాణ వచ్చాక లాఅండ్ ఆర్డర్ అదనపు డీజీగా, జైళ్లశాఖ డీజీగా కొనసాగారు. కాగా, 2025 సెప్టెంబర్ వరకు జితేందర్ సర్వీస్ ఉన్నది. అంటే ఆయన 14 నెలల పాటు డీజీపీ పదవిలో కొనసాగనున్నారు.
టీజీఎస్పీ అడిషనల్డీజీగా సంజయ్‌కుమార్‌జైన్
రాష్ట్రంలో మరో 15 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. మల్టీ జోన్2 ఐజీగా ఉన్న ఐపీఎస్ అధికారి సుధీర్‌కుమార్‌ను రాచకొండ కమిషనర్ గా నియమించారు. గతంలో ఆయన రాచకొండ నుంచే మల్టీ జోన్2 ఐజీగా వెళ్లారు. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. లాఅండ్ఆర్డర్అడిషనల్డీజీగా మహేశ్ భగవత్‌కు పోస్టింగ్ ఇచ్చారు.
హోంగార్డ్స్, ఆర్గనైజేషన్అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ఏడీజీగా స్టీఫెన్రవీంద్రను నియమించారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ ను నియమించడంతో పాటు పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు అప్పగించింది. లాఅండ్ఆర్డర్అడిషనల్డీజీగా ఉన్న సంజయ్ కుమార్ జైన్‌ను టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా బదిలీ చేసింది. రాచకొండ కమిషనర్‌నుంచి ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి ట్రాన్స్ఫర్ అయ్యారు.
మల్టీజోన్ 1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని, రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా బి.బాలస్వామి, హైదరాబాద్ వెస్ట్జోన్డీసీపీగా జి.చంద్రమోహన్, సీఏఆర్‌హెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షితమూర్తిని నియమించారు.
నేరాలను నియంత్రిస్త : డీజీపీ
డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి జితేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో జితేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నివారణకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ అన్నారు. లాఅండ్ ఆర్డర్‌ను కాపాడుతూనే నేరాలకు కంట్రోల్ చేస్తామని చెప్పారు. యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను మరింత బలోపేతం చేస్తామన్నారు.