
రాకేష్ వర్రే హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’. మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 1980లో జగిత్యాలలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.
దీనికోసం చాలా రీసెర్చ్ చేసి జెన్యూన్‌గా సినిమా తీశాం. విలువలతో కూడిన ఓ వ్యక్తి జీవితాన్ని ఈ తరం జనానికి పరిచయం చేయాలని చేసే ప్రయత్నమే ఈ చిత్రం’ అని చెప్పాడు. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని నిర్మాత అన్నారు. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.