బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి: జితేందర్ రెడ్డి

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి: జితేందర్ రెడ్డి

మక్తల్​/నర్వ.వెలుగు:  తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం నర్వ మండల కేంద్రంలో  జరిగిన పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి జలందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని అన్నారు.   రాష్ట్రంలో బీజేపీని  గెలిపిస్తే బీసీని సీఎంను చేస్తామన్నారు.

కాంగ్రెస్​ వస్తే రాష్ట్రం అవినీతి పెరుగుతదని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కన్మనూర్, లంకాల, యాంకి,  జంగంరెడ్డిపల్లి, ఎల్లంపల్లి, జిన్నారం, ఉందేకోడ్, నర్వ ,పాతర్చేడ్ గ్రామాల బీఆర్​ఎస్​,కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరారు.  మక్తల్ లో బీజేపీ, బీజేవైఎంల  అధ్వర్యంలో ర్యాలీ నిర్వహంచారు. ఈ సందర్భంగా పార్టీ లీడర్​ కొండయ్య మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి  జలందర్​రెడ్డిని  గెలిపించాలన్నారు.   కార్యక్రమాల్లో  నాగురావు నామోజీ. కర్ని స్వామి,  నంగి దేవేందర్ రెడ్డి,  గంగాధర్ గౌడ్, సర్పంచ్ సంధ్య ఆంజనేయులు, బలరాంరెడ్డి,రాజశేఖర్​రెడ్డి,మంజునాథ్​,బాయికాడి  నర్సింహారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.