కొందరు కావాలనే రైతులను రెచ్చగొడ్తున్నరు : కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్

  •     నేనేం ఖాళీగా కూర్చోలేదు
  •     కామారెడ్డి  మాస్టర్  ప్లాన్ పై కలెక్టర్​ జితేశ్​ పాటిల్​ 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ అసలు ఇష్యూనే కాదని, కొందరు ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్  ఆరోపించారు. కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, అది డ్రాఫ్ట్ దశలోనే ఉందని, ఇంకా ఫైనల్ కాలేదని ఆయన పేర్కొన్నారు. మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన నేపథ్యంలో కలెక్టర్​ గురువారం సాయంత్రం మీడియాతో ​ఆయన మాట్లాడారు. ‘‘రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే పది మంది వచ్చి ప్రజంటేషన్ ఇవ్వవవచ్చు. 

అంతేకానీ నన్నే వారి దగ్గరకు రమ్మనడం సరికాదు. నేనేమీ ఖాళీగా లేను. నాకు ఇదొక్కటే ఇష్యూ కాదు. కొంత మంది కావాలనే రైతుల్ని మిస్ గైడ్  చేశారు. జర్నలిస్టులు కూడా వారికి తోడై తప్పుదారి పట్టిస్తున్నారు. కొందరు కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను అక్కడ కూర్చోబెడుతున్నారు. రైతులకు ఈ ఇష్యూపై అవగాహన కల్పిస్తాం”  అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, వారి భూములు ఎక్కడికీ పోవని అన్నారు.