RCB 2025: మా టైమ్ వస్తుంది.. వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొడతాం: రూ. 11 కోట్ల RCB ప్లేయర్

RCB 2025: మా టైమ్ వస్తుంది.. వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ కొడతాం: రూ. 11 కోట్ల RCB ప్లేయర్

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి ఆటగాళ్లు ఈ జట్టుకు ఆడడం వలన ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి ఆర్‌సీబీకి టైటిల్‌ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 2016 లో ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది.

గత సీజన్ లో వరుసగా 7 మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆర్సీబీ.. ఎలిమినేటర్ మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సీజన్ లో ఈ సారి కొత్త జట్టుతో బరిలోకి దిగుతుంది. కోహ్లీ, యష్ దయాల్, పటిదార్ మినహాయిస్తే ఈ సారి జట్టు మొత్తం మారిపోయింది. దీంతో ఈ సీజన్ లో అయినా ఆ జట్టు టైటిల్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సారి ఆర్సీబీ టైటిల్ గెలిపించడమే తన లక్ష్యమని.. ఆ జట్టులో చేరిన కొత్త వికెట్ కీపర్ జితేష్ శర్మ సీజన్ కు ముందు ధీమా వ్యక్తం చేశాడు. 

ALSO READ | Delhi Capitals: అనుభవానికే ఓటు.. వైస్ కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

జితేష్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కలను పంచుకున్నాడు. క్రిక్‌స్టాసీతో ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో మాజీ పంజాబ్ కింగ్స్ (PBKS) స్టార్ ఈ విధంగా మాట్లాడాడు. " ఈ సీజన్ ఐపీఎల్ గెలవాలనుకుంటున్నా. గెలిచి విరాట్ కోహ్లీకి అంకితమిస్తాను. ఆర్సీబీ జట్టుకు ఫినిషర్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సీజన్ లో మేము 14 మ్యాచ్ ల్లో 11 మ్యాచ్ లు గెలుస్తాం. మా టైం వచ్చి ఒక్కసారి ఆర్సీబీ టైటిల్ గెలిస్తే వరుసగా ఐదు సీజన్ లలో టైటిల్స్ గెలుస్తుంది". అని జితేష్ అన్నాడు.

ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో జితేష్ శర్మను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్  జోష్ హాజిల్‌వుడ్ ను అత్యధికంగా రూ.12.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో తమ తొలి మ్యాచ్ ను డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈ సీజన్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.