భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పలు శాఖల ఆఫీసర్లతో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన స్పీడప్ చేయాలన్నారు.
రోజుకు కనీసం 10 దరఖాస్తులు పరిష్కరించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన టైంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఫైనల్ చేయాలన్నారు. ప్రతి దరఖాస్తులో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పరిష్కరించే విధంగా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీపీఓ చంద్రమౌళి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.