కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్లో ఏర్పాటు చేసిన సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సెంటర్లు ఈ నెల 27 వరకు కొనసాగుతాయన్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో, కామారెడ్డి నియోజకవర్గానికి స్థానిక ఆర్డీవో ఆఫీస్లో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు.
ఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి
పోలింగ్ రోజుకు 48 గంటల ముందు అత్యంత కీలకమని, ఆఫీసర్లు అలర్ట్గా ఉండాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ఆఫీసర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఆఫీసర్లు విధులు నిర్వహించాలన్నారు. 48 గంటల ముందు నుంచి ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.