- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో ఇరుకు గదిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌ను క్యాజువాలిటీలోకి మార్చాలని కలెక్టర్జితేశ్వి పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. హాస్పిటల్లో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆయన శనివారం పరిశీలించారు. డ్రైనేజీ పనులను స్పీడ్‌గా పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుత డయాలసిస్ సెంటర్లో ఐదు యూనిట్లు ఉన్నాయని, మరో ఐదు యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. హాస్పిటల్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో ఆర్ఎంవో డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
ఆదివాసీ సంస్కృతిని విస్తరిద్దాం
భద్రాచలం : మారుమూల ప్రాంత ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రపంచ దేశాలకు విస్తరిద్దామని కలెక్టర్ జితేశ్ పిలుపునిచ్చారు. ఐటీడీఏలోని వైటీసీలో డీఆర్డీఏ, ఎంఎస్ఎంఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, ఔషధగుణానికి సంబంధించిన పదార్థాల స్టాళ్లను ఆయన పరిశీలించారు. గిరిజన మహిళలే కాకుండా వివిధ గ్రూపు మహిళల సహకారం తప్పకుండా ఈ యజ్ఞానికి అవసరం ఉంటుందన్నారు.
ముక్కోటి ఏకాదశికి దేశ, విదేశాల నుంచి భక్తులు, టూరిస్టులు వస్తారని, వారికి రివర్ ఫెస్టివల్ ఏరు ద్వారా ఆదివాసీ ప్రపంచాన్ని పరిచయంచేద్దామని పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్యాకింగ్ డిజైనర్స్ మహిళలకు కరక్కాయల పొడితో టీ తయారు చేయడం, జొన్న రవ్వ, రాగి రవ్వ, మరమరాలతో బొంగు పేలాలు తయారు చేసి ప్యాకింగ్, డిజైనింగ్వాటి మీద గ్రూపు పేర్లు ఏ విధంగా పెట్టాలో నేర్పించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో విద్యాచందన, డీఎం జీసీసీ సమ్మయ్య ఉన్నారు.