- జనరల్ సెక్రటరీగా మల్లారెడ్డి, ట్రెజరర్‌గా సతీశ్ గౌడ్ గెలుపు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) కొత్త ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా పి. మల్లా రెడ్డి, ట్రెజరర్‌గా డి. సతీశ్ గౌడ్ గెలుపొందారు. బుధవారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో రిటర్నింగ్ అధికారి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ పడ్డ వి. చాముండేశ్వర్ నాథ్‌పై 34 ఓట్ల తేడాతో జితేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా.. చాముండేశ్వర్‌కు 9 ఓట్లు మాత్రమే పడ్డాయి.
జనరల్ సెక్రటరీగా మల్లారెడ్డి (40) 28 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి సి. బాబురావు (12)ను ఓడించారు. ట్రెజరర్ సతీశ్ గౌడ్ (40) కూడా 28 ఓట్ల తేడాతో ప్రదీప్ కుమార్ (12)పై గెలిచారు. నాలుగు వైస్ ప్రెసిడెంట్, నాలుగు జాయింట్ సెక్రటరీ, మరో15 ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టులు ఏకగ్రీవం అయ్యాయి. కొత్త కార్యవర్గం
నాలుగేండ్లు పదవిలో ఉంటుంది.