జిట్టాకు తీవ్ర అస్వస్థత

యాదాద్రి, వెలుగు : తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పాలుపంచుకున్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోక్​సభ ఎన్నికల తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. మెదడుకు సంబంధించిన సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అయితే ఇటీవల జిట్టా ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. దీంతో గడిచిన 20 రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటలో ఆయన ట్రీట్​మెంట్​పొందుతున్నారు.