మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయన్ను తప్పి్ంచింది. కమల్నాథ్ స్థానంలో OBC నాయకుడు జితు పట్వారీని నియమించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమికి బాధ్యత వహిస్తూ కమల్నాథ్ రాజీనామా చేస్తాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
ఈ క్రమంలో అధిష్టానమే ఆయన్ను తప్పించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో జితు పట్వారీ ఓటమిపాలయ్యాడు. సావు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన ఆయన 35 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లో OBCలు 50% కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు కాగా 230 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంది.