హైదరాబాద్​లో జేఎం .. ఫైనాన్షియల్ కొత్త బ్రాంచ్​

హైదరాబాద్, వెలుగు :  జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ లిమిటెడ్ తన పునరుద్ధరించిన హైదరాబాద్ శాఖను గురువారం ప్రారంభించింది. కార్యక్రమంలో ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్  అసిత్ భండార్కర్, స్ట్రాటజిక్ అలయన్స్ డైరెక్టర్  మనీష్ శర్మ, దక్షిణ జోనల్ హెడ్ జ్యోత్స్నాకులకర్ణి, ఏపీ, తెలంగాణ రీజనల్ హెడ్ విజయ్ దినకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ లిమిటెడ్ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ అసిత్ భండార్కర్ మాట్లాడుతూ “హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. హైదరాబాద్  ఏయూఎం వృద్ధి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.90 వేల కోట్లకు పైగా పెరిగింది. ఇది మార్చి, 2021లో సుమారు రూ.66 వేల కోట్ల నుంచి 35శాతం ఎగిసింది. ఈ నగరం దక్షిణ భారతదేశంలోని పెద్ద మార్కెట్లలో ఒకటి”అని తెలిపారు.