బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15 లోపు ఇమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు తప్పని సరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో డిప్లొమా లేదా బీఎస్సీ విద్యార్హత కలిగి ఉండాలి.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కు అప్లై చేసే వారి వయస్సు 50 ఏళ్ల కంటే ఎక్కవగా ఉండకూడదు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులను వయోసడలింపు ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.20వేలు సాలరీ అందిస్తారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ పూర్తి వివరాలు నిపింన ఫారమ్‌ను కావాల్సిన జిరాక్స్ కాపీలతోపాటు anandk@jncasr.ac.in ఈ-మెయిల్ ఐడీకి పంపాలి.